
Anika Surendran : అనికా సురేంద్రన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ ఇండస్ట్రీలో ఎంటరై. క్రమ క్రమంగా తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు దక్కించుకుంది. చిన్నతనంలోనే తను నటించిన సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది.
అనిఖా జన్మస్థలం కేరళలోని మంజేరి. చిన్నతనం నుంచే ఆమెకు నటనపై ఇంట్రస్ట్ ఉండేది. దీంతో ఆమె తండ్రి సురేంద్రన్ మరింత ప్రోత్సహించాడు. దీంతో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ప్రత్యక్షమైంది. 2010లో ‘కదతుదారున్న’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘యెన్నై అరిందాల్’, ‘విశ్వాసం’, జయలలిత ఆటోబయోగ్రఫీ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ ‘క్వీన్’లో కూడా నటించింది. విశ్వాసం తమిళంలో తీసినా తెలుగులోకి డబ్ చేశారు.

అనికా తెలుగులో నేరుగా నాగార్జున హీరోగా చేసిన ‘ది ఘోస్ట్’లో హీరోకు మేనకోడలిగా నటించింది. ఇక ఆ తర్వాత ‘బుట్టబొమ్మ’తో పూర్తి స్థాయి హీరోయిన్ గా దర్శనం ఇచ్చింది అనికా. ఆమె 2013లో కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, 2011, 2018లో ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, 2020లో జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ది బెస్ అవార్డులను దక్కించుకుంది.
ఈ మధ్యే హీరోయిన్ గా వచ్చిన తన చిత్రం బుట్టబొమ్మ ఆశించిన మేర ఆడలేదు. కొంత డీప్రెషన్ లో ఉన్నా సర్దుకొని మరీ పుంజుకుంటుంది అనికా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిక్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. బ్లూ డ్రెస్ లో హొయలు పోతూ బెడ్ పై పడుకొని ఉన్న పిక్ లను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వీటిని చూసిన కుర్రకారు తెగ షేర్ చేస్తున్నారు.
View this post on Instagram






