
ఈ మధ్య balaiah నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను పక్కన పెడితే బాలయ్య మార్కెట్ ఎంత అనే విషయం గురించి మాట్లాడాలి అంటే.. బాలకృష్ణ నటిస్తున్న సినిమాలకు అన్ని కలిపి 100 కోట్ల మార్కెట్ ఉంది అని అనుకున్న మేకర్స్ ఈయన సినిమాకు ఖర్చు చేయాల్సింది ఎంత? బడ్జెట్ ఎంత పెట్టాలి? ఎంత వస్తే నిర్మాతలు లాభ పడతారు.. ఇలా చాలా విషయాల గురించి మాట్లాడాలి.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా గురించి అనిల్ నిర్మాతతో పెట్టిస్తున్న బడ్జెట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది.. బాలయ్య బడ్జెట్ ను మించి అనిల్ ఖర్చు చేయిస్తున్నాడు అని టాక్..
ప్రజెంట్ ఈ సినిమా ఇంటర్వెల్ ఫైట్ ను షూట్ చేస్తున్నారు. మరి ఈ ఒక్క ఫైట్ కోసమే 10 కోట్లు ఖర్చు చేస్తున్నారట.. ఇప్పటికే జైలు వంటి భారీ సెట్ వేసి అక్కడ కూడా ఒక ఫైట్ సీన్ షూట్ చేసారు. ఇలా ఒక్కో ఫైట్ కోసమే కోట్లకు కోట్లు ఖర్చు చేయిస్తున్నారట.. స్టార్ కాస్ట్, సినిమా బడ్జెట్ అంతా కలిపి రూ.100 కోట్లను దాటేస్తుంది అని టాక్.. దీంతో ఈ సినిమాతో నిర్మాతకు ఎంత లాభం ? ఆయనకు మిగిలేది ఏంటి? 100 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమాకు లాభం లేకపోతే నిర్మాత కోలుకోవడం కష్టమే..






