Anjali New Look : తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో గుర్తింపు పొందిన హీరోయిన్ అంజలి. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించిన అంజలి నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చింది.
మొదట మోడలింగ్ చేసిన ఆమె తమిళంలో తెరంగేట్రానికి రెండు సార్లు బ్రేక్ పడంది. ఆ తర్వాత 2006లో ‘ఫొటో’తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2007లో ప్రేమలేఖ రాసా చేసింది.
కానీ వీటిన్నింటికంటే ఆమెకు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ అంగడి తెరు తెలుగు డబ్ మూవీ షాపింగ్ మాల్. ఈ సినిమాతో అంజలిని తెలుగు వారు బాగా ఓన్ చేసుకున్నారు.
రెండు లాంగ్వేజ్ ఇండస్ట్రీల్లో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ సాధించింది. దీంతో ఆమెకు ప్రాజెక్టులు పెరుగుతూ వచ్చాయి. వరుసపెట్టి సినిమాలు చేసింది. ఎంతలా అంటే సంవత్సరానికి రెండు సినిమాల చొప్పున తీస్తూ వచ్చింది.
హీరోయిన్ గానే చేస్తానని గిరి గీసుకొని కూర్చోకుండా మంచి పాత్ర అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తానని చెప్పి. కొన్నింటిలో సపోర్ట్ యాక్టర్ గా కూడా చేసింది. ఇందులో భాగంగా వచ్చిందే వకీల్ సాబ్. ఇందులో హీరోయిన్ పాత్ర లేకున్నా.. మరో ఇద్దరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లు మ్యూజిక్ వీడియోస్ పై కూడా దృష్టిపెట్టింది ఈ అమ్మడు. ఇందులో భాగంగా వచ్చిందే ఝాన్సీ డీస్నీ+హాట్ స్టార్ లో రెండు సీజన్లుగా ఈ సిరీస్ రన్ అయ్యింది. ఈ సిరిస్ లో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
అవార్డులు, రివార్డులు కూడా ఎక్కువగానే అందుకుంది అంజలి. ఉత్తమ నటి, స్పెషల్ జ్యూరీ, ఉత్తమ సపోర్ట్ నటి లాంటి అవార్డులను సంవత్సరానికి ఒకటి, రెండు చొప్పున అందుకుంది అంజలి.
నటి అంజలి చివరగా మలయాళ థ్రిల్లర్ డ్రామా ఇరట్టా, తెలుగుతో మాచర్ల నియోజకవర్గంలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ లో కనిపించింది.
హారర్ కామెడీ గీతాంజలికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది ఆమెకు 50వ చిత్రమని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అంజలి ఇటీవల ఓ ఫోటో సెషన్ కు పోజులివ్వగా, ఆ ఫొటోలు ఇప్పుడు ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అంజలి ఫ్యూసియా పవర్ సూట్, బ్లేజర్ ధరించింది. ఆమె సూట్ లో ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు తన హాట్ సైడ్ ను కూడా ప్రదర్శించింది. ‘ట్రెండ్స్ తో నిండిన ప్రపంచంలో నేను క్లాసిక్ గా ఉండాలనుకుంటున్నాను’ అంటూ అంజలి ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోలను స్ర్కీన్ స్టూడియో స్బిహర్షా బంధించారు.