
Anni manchi shakunale Movie Twitter review : ”అన్ని మంచి శకునములే”.. ఈ సినిమా మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సంతోష్ శోభన్ హీరోగా, మాళవిజా నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది.. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా వెండితెర, బుల్లితెర అనే బేధం లేకుండా ఎక్కడ బడితే అక్కడ ప్రమోషన్స్ చేసారు.
ఈ ప్రమోషన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి అనే చెప్పాలి.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించారు.. మరి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ పడింది.. మరి ఈ సినిమాను ప్రీమియర్ లో వీక్షించిన ఆడియెన్స్ ట్విట్టర్ ద్వారా రివ్యూస్ ఇస్తున్నారు..
అలా మొదలైంది, ఓ బేబీ వంటి సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ లేడీ డైరెక్టర్ ఈసారి సంతోష్ శోభన్ కు పక్కా హిట్ ఇస్తుంది అని టాక్.. పక్కా ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈసారి ఎలా హిట్ అందిస్తుందో చూడాలి.. ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే అంతా పాజిటివ్ గానే ఉంది.. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ స్టోరీని చూశామని నెటిజెన్స్ చెబుతున్నారు..
సినిమా చూస్తున్నంతసేపు హాయిగా, రిలాక్స్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా సెకండాఫ్ ఉందని అంటున్నారు. కొన్ని సీన్స్ మినహా అంతా బాగుంది అని చెప్పడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని సంతోష్ శోభన్ కు బ్రేక్ ఇస్తుంది అని అంటున్నారు.. చూడాలి ఇక్కడ రివ్యూస్ ఎలా వస్తాయో..