
Biopic : 2019 ఎన్నికలకు ముందు Biopic హవా నడిచింది. ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీయడంతో జగన్ ఆ ఎన్నికల్లో ఆ బయోపిక్ తో లబ్ది పొందాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పడు 2024 ఎన్నికల్లో కూడా మరో బయోపిక్ చేయాలని జగన్ భావిస్తున్నాడట. అయితే అ బయోపిక్ ఎవరిది తెలుసుకుందాం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా యాత్ర. ఈ సినిమాలో హీరోగా మలయాళ మెగాస్టార్ గా పిలువబడే మమ్ముట్టి నటించాడు. అయితే 2024 ఎన్నికల్లో యాత్ర-2 పేరిట మరో బయోపిక్ దర్శకుడు మహి వి. రాఘవన్ ప్రణాళికలు సిద్ధం చేశారు. యాత్ర -2 వైఎస్ సీఎం జగన్ పొలిటికల్ లైఫ్ అధారంగా సాగనుందని సమాచారం. చాలా మంది హీరోలను జగన్ పాత్రలో నటించేందుకు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే జగన్ పాత్రలో హీరో జీవా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం
దర్శకుడు రాంగోపాల్ వర్మ Biopic లను తీయడంలో సిద్దహస్తుడు. ఇటు తెలంగాణలో, ఆటు ఆంధ్రాలో బయోపిక్ లు తీశాడు వర్మ, ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా రెండు సినిమాలు విడుదల అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, కథానాయకుడు పేరుతో సినిమాలు తీశారు. అయితే కథానాయకుడు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
యాత్ర సినిమాకు మంచి స్పందన రావడంతో యాత్ర -2 కు ప్లాన్ చేశాడు రాఘవ. అయితే యాత్ర సినిమాలో జగన్ పాత్ర హైలెట్ గా ఉండనుందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో యాత్ర -2 సినిమా జగన్ కు ఎంత వరకు పొలిటికల్ గా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.






