
poster of Adipurush : ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ముందు నుండి కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది.
రామాయణం వంటి దృశ్యకావ్యాన్ని ఎలా తెరకెక్కించాడో అని అంతా వైట్ చేస్తున్నారు.. ఈ సినిమా రిలీజ్ కు మరో నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.. కానీ పలువురు ఇంకా ఇందులో తప్పులు వెతుకుతూనే ఉన్నారు..
ట్రైలర్ లోని సన్నివేశాలను షేర్ చేసి మరీ ఇది కాపీ అని నిరూపిస్తున్నారు. తాజాగా హనుమంతుడు ఎగురుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో అపార్ట్ మెంట్స్ కనిపిస్తున్నాయి.. రామాయణం కాలంలోనే ఇంత ఎత్తైన భవనాలు కూడా నిర్మించారా (poster of Adipurush) అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇది ఆధునిక రామాయణం అని హాలీవుడ్ సినిమా పోస్టర్ ని కాపీ చేసి ఎడిట్ చేయడం మర్చిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుంటే, కృతి సనన్ సీతగా నటించింది. అలాగే లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించ నున్నారు.. ఇంకా ఈ సినిమాకు అజయ్ – అతుల్ సంగీతం అందించగా.. టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.. జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి..