Fetus inside the baby : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ పెరుగుతున్న శిశువు లోపల పిండాన్ని వైద్యులు కనుగొన్నారు. ఫీటస్ ఇన్ ఫీటస్‌గా పిలుచుకునే వైద్య శాస్త్రానికి సంబంధించిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో మూడు రోజుల క్రితం పుట్టిన చిన్నారి లోపల మరో చిన్నారి కనిపించింది. ఈ పరిస్థితి మిలియన్ల మంది మహిళల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఈ వార్త విని సామాన్యులు మాత్రమే కాకుండా డాక్టర్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ అరుదైన కేసుపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. ఇంతలో.. మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల ప్రకారం, ఇది ఒక మిలియన్ మహిళల్లో ఒకరికి జరుగుతుంది. కాగా, అప్పుడే పుట్టిన శిశువును రక్షించేందుకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
వివరాల్లోకి వెళితే… సాగర్ జిల్లాకు చెందిన ఓ గర్భిణిలో ఈ అరుదైన ఉదంతం వెలుగు చూసింది. కెస్లీకి చెందిన తొమ్మిది నెలల గర్భిణి పరీక్ష కోసం ఓ ప్రైవేట్ క్లినిక్‌కి వెళ్లింది. అక్కడ.. మహిళ కడుపులో పెరుగుతున్న నవజాత శిశువు లోపల శిశువు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో… ఆమెను మెడికల్ కాలేజీకి పిలిపించి పరీక్షించారు. మహిళ కడుపులో మరో శిశువు, టెరాటోమా ఉనికిని గుర్తించారు. ఈ క్రమంలో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో మళ్లీ కెస్లీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. అల్ట్రాసౌండ్ రిపోర్టులో మహిళ కడుపులో గడ్డ కనిపించిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు. వైద్య చరిత్రలో ఇటువంటి కేసులు చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు కేవలం 200 మాత్రమే నమోదయ్యాయి. జీవితంలో తొలిసారిగా ఇలాంటి కేసు చూశానని డాక్టర్ చెప్పారు. గర్భిణి సాధారణ ప్రసవం ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు.