39.4 C
India
Saturday, June 6, 2026
More

    Director Trivikram : టాలీవుడ్ తెరపైకి మరో వారసుడు  

    Date:

    Director Trivikram
    Director Trivikram

    Director Trivikram : మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటి నుంచి ఒకరు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో  పోస్టులు వైరల్ గా మారాయి. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల తిరుమలకు వెళ్లడమే. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా కంటపపడ్డాడు. భార్య, పిల్లలతో దైవ దర్శనానికి వచ్చిన త్రివిక్రమ్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో త్రివిక్రమ్ పెద్ద కొడుకు హీరోకు ఏ మాత్రం తక్కువగా లేడు అంటూ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నది.

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి తన లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. హీరో మెటీరియల్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  త్రివిక్రమ్ సినిమా ఫంక్షన్లలో తప్ప  బయట పెద్దగా కనిపించడు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన త్రివిక్రమ్ మొదటి సారి మీడియా కంటపడ్డాడు.   ఇక అందరి దృష్టి  త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి పైన పడింది. మంచి హైట్, కళ్లజోడు పెట్టుకుని అచ్చం తండ్రిలాగానే స్టైలిష్ గా కనిపించాడు కాబోయే హీరో అంటూ నెట్టింట వైరల్ అవుతున్నాడు స్టార్ డైరెక్టర్ కుమారుడు.

    డైరెక్షనా.. హీరోనా..?
    నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)కు  త్రివిక్రమ్ మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో  త్రివిక్రమ్ పలు సినిమాలు చేశారు.  అనుబంధంతో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి సినిమాలు నిర్మించాడానికి సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ఏర్పాటు చేసి తను భార్య సాయి సౌజన్యను నిర్మాతను చేశారు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అంతగా బయటకు రాని సాయి సౌజన్య తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల తమ సినిమా ప్రమోషన్‌లో మీడియాతో మాట్లాడిన సాయి సౌజన్య.. కుమారుడు రిషి మనోజ్ గురించి ప్రస్తావించారు. తమ కుమారుడు రిషికి దర్శకత్వంపై ఆసక్తి ఉందని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలో ప్రస్తుతం తెలుసుకుంటున్నాడని వెల్లడించారు. అయితే రిషిని హీరోగా చేస్తే  బాగుంటుందని పలువురు  త్రివిక్రమ్ కు  సలహాలు ఇస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం తన కుమారుడు హీరోనా, డైరెక్టరా అనేది మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఓ సినిమాకు రిషి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్‌ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు… కారణం ఇదేనా?

    Trivikram : కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమా అంటే హీరోలకి గ్యారంటీ...

    Trivikram : డైలమాలో పడిన త్రివిక్రమ్…ఇప్పుడు తన దారెటు…

    Trivikram : ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు....

    Bunny-Trivikram : మైథలాజికల్ ఫాంటసీగా బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. కథ గురించి హింట్ ఇచ్చిన బన్నీ వాస్..

    Bunny-Trivikram Movie : పుష్ప2 షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో తన నెక్ట్స్...

    Poonam Kaur : త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. ఇన్నేళ్లకు నేరుగా పేరు పెట్టి మరీ..

    Poonam Kaur : నటి పూనమ్ కౌర్ కు కొన్ని సంవత్సరాలుగా...