Aishwarya Menon :
టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులు, ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రాజెక్ట్ #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). 1990 బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ జోనర్ గా వస్తుంది ఈ చిత్రం. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించబోతున్నాడు. సాహో లాంటి భారీ ప్రాజెక్టులను తీసిన సుజిత్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాడు.
పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబోలో వస్తున్న చిత్రం #OG. ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో కథ ఉంటుంది కాబట్టి షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. వపన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ఉండడంతో కాస్తంత బ్రేక్ పడింది. ఈ యాత్రకు ముందే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. పవన్ యాత్ర ముగించుకొని రావడంతో మిగిలిన పోర్షన్ పూర్తి చేసి విడుదలకు సన్నాహాలు చేస్తామని చెప్పారు.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే భారీ తారాగణాన్ని తీసుకున్నారు. అందులో కోలివుడ్ స్టార్ అశ్వర్య మీనన్ కూడా ఉన్నారు. ఒక భారీ యాక్షన్ సీన్స్ ఆమెతో తీయనున్నాడు దర్శకుడు. ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుందని, పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే ధీటైన ఆఫీసర్ గా ఆమె పర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పాలి. ఇటీవల విడుదలైన ‘స్పై’ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.
#OG సినిమాకు ప్రొడ్యూసర్ దానయ్య, ఇతను గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ప్రొడ్యూసర్ గా చేశాడు. అతని బ్యానర్ ‘డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై భారీ ఖర్చుతో #OG రూపొందుతుంది. ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తు్న్నారు. ఈ చిత్రం వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.