Motivational tweet Anand Mahindra : వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పారిశ్రామిక వర్గాల నుంచి సామాన్య ప్రజలు కూడా ఎంతో చేరువయ్యారు. ఆనంద్ మహీంద్రా ఫాలోవర్లు ప్రతి సోమవారం అతని నుంచి ఓ మోటివేషన్ పోస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి కూడా ఓ వీడియో పోస్ట్ చేసి మంచి ప్రేరణ కల్పించే ప్రయత్నం చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఓ చిన్నారి తన భుజాలపై పెద్ద బరువును మోస్తూ కనిపించాడు.
ఈ క్లిప్‌ను తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు మహీంద్రా. పిల్లల నుంచి నేర్చుకోవడానికి సంబంధించిన చాలా స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కోట్ చేశారు. ఈ వీడియో క్లిప్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వెయిట్స్ ఎత్తుతున్న చిన్నారి..
ఈ వీడియోలో, ఒక చిన్నారి తన రెండు చేతులతో జిమ్ లో ఉపయోగించే బార్ రాడ్ ఎత్తతుతున్నాడు. వెయిట్ లిఫ్టర్ లా తలపైకి బరువు ఎత్తారు. ఈ చిన్నారిని వీడియో తీస్తూ తల్లిండ్రులు మురిసిపోతున్నాడు. దాదాపు 14 సెకన్ల పాటు వీడియో నిడివి ఉన్నది. ఈ క్లిప్ కు మహీంద్రా తన పోస్ట్‌లో ఓ కోట్ జత చేశారు. మీరు అనుకున్నదానికంటే మరింత భారాన్ని మోయగలరు. ఆ పిల్లాడు చేయగలిగితే… నువ్వు కూడా చేయగలవు.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా సెప్టెంబర్ 23న ఉదయం పోస్ట్ చేశాడు. కేవలం అరగంటలో 35 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వెయ్యి మందికి పైగా నెటిజన్స్ లైక్ చేశాడు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. మనం అనుకున్నదానికంటే ఎక్కువ చేయగలమనే నమ్మకమే నిజమైన బలం. పరిమితులను పెంచుతూ పోతూ ఉంటే ఏదైనా సాధించగలం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అవును మేం చేయగలం, చేస్తాం, చేస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
You can lift burdens far greater than you think you can.
If he can do it… you can too#MondayMotivation pic.twitter.com/2NVWnM4JOm
— anand mahindra (@anandmahindra) September 23, 2024