
Ravi Teja-Rajamouli combo : మన టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ డైరెక్టర్ ఎవరు అంటే ఆ లిస్టులో మన తెలుగు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారి పేరు తప్పకుండ ఉంటుంది.. ఈయన తన కెరీర్ లో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాలతోనే ఈయన అగ్ర డైరెక్టర్ గా ఎదిగాడు.. కెరీర్ లో చేసిన సినిమాలన్నీ హిట్ అనే చెప్పాలి.
ఇక గత రెండు సినిమాల నుండి ఈయన క్రేజ్ ఇండియా దాటి ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకింది.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. అందుకే ఈయనతో సినిమా చేయాలని ప్రతీ హీరో కోరుకుంటారు.. ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాకు సన్నాహాలు చేసుకుంటూనే రవితేజతో మరో సినిమాకు కమిట్ అయ్యాడని అంటున్నారు. రవితేజ క్రాక్, ధమాకా వంటి హిట్స్ తో ఈ మధ్య మరింత హుషారుగా సినిమాలు చేస్తున్నాడు.. ప్రజెంట్ ఈయన వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాతో మొదటిసారి రవితేజ పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగు పెట్టబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత రవితేజ రావణాసుర వంటి ప్లాప్ ఇచ్చిన సుధీర్ వర్మతో మళ్ళీ కమిట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి అలాంటి ఇలాంటి ప్లాన్ తో రావడం లేదు మాస్ రాజా.. ఈ సినిమాకు అదిరిపోయే ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తుంది. సరికొత్త కథతో పాటు మేకింగ్ లో కూడా చాలా మార్పులు చేయబోతున్నారని తెలుస్తుంది.
మరి ఇందుకోసం రాజమౌళి సలహా తీసుకుంటున్నారట.. ఇప్పటికే రవితేజ, రాజమౌళి కాంబోలో విక్రమార్కుడు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.. ఇప్పటికి కూడా రాజమౌళికి రవితేజతో మరో సినిమా చేయాలని ఉన్న కుదరడం లేదు.. మరి సుధీర్ వర్మ తీసే సినిమాకు రాజమౌళి సూచనలు ఇవ్వబోతున్నాడు అంటే పరోక్షంగా జక్కన్న ఇంవోల్వ్మెంట్ తప్పకుండ ఉంటుంది.. మరి ఆయన సలహాలు ఈయన సినిమాపై ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి..