snake పాములంటేనే భయపడిపోతుంటాం.. అవి కనిపిస్తే వెనక్కి చూడకుండా పరిగెత్తుతుంటాం. ముఖ్యంగా వానకాలంలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్ లో వీడియోల్లో మనం పాముల కొట్లాట చూస్తుంటాం. చాలా మంది నేరుగా కూడా చూసి ఉంటారు. ఇలాంటి వీడియోలు ఎక్కువ శాతం నేషనల్ జియోగ్రఫిక్ చానల్ లో కనిపిస్తుంటాయి. అయితే పాములు కోడి గుడ్లను, పక్షి పిల్లలను పాములు తినడం మనం చూస్తుంటాం. ఇలాంటివన్ని నెట్టింటా కామన్ గా కనిపిస్తుంటాయి. మన భూమిపై ఎన్నో రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా కర్ణాటకలో ఓ ఘటన జరిగింది. సిటీ మైసూర్ లో పామును మరో పాము మింగింది. ఈ ఘటన కు సంబంధించి న వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నది. నెటిజన్ల ను ఈ ఘటన ఆశ్చర్య పరుస్తున్నది. మైసూరులోని బోగాడిలో ఈ ఘటన జరగగా, ఈ వీడియో తీశారు. ఒక నాగుపాము మరో పామును మింగుతుండగా స్థానిక వ్యక్తి ఒకరు ఈ వీడియో తీశారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు అంతా చూస్తూ వామ్మె అంటూ కామెంట్లు పెడుతున్నారు. పామును మింగే అంత ఆకలి ఉందా.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ముందుగా పాములు కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాతే నాగుపాము మరో పామును మింగింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది.