
వచ్చే నెల 16 న రిలీజ్ కానున్న ఆదిపురుష్ కు మరో సమస్య ఎదురువకాబోతుంది. ఇప్పుడిప్పుడే ఒక్కో సమస్యను అధిగమిస్తూ వస్తున్నది. మరో ఇరవై రోజుల తర్వాత థియేటర్లు జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లనున్నాయి. మొదటి టీజర్ నెగటివిటీని రీసెంట్ గా రిలీజైన ట్రైలర్, లిరికల్ వీడియోలు తుడిచి పెట్టాయి. జై శ్రీరామ్ థీమ్ సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నది. అయితే నిర్మాతలు భారీ ఓపెనింగ్స్ లక్ష్యంగా మంచి రిలీజ్ డేట్ ను ఎంచుకున్నారు. నార్త్ తో పాటు సౌత్ లో మరో సినిమా పోటీలో లేకుండా చూసుకున్నారు. బాహుబలి కలెక్షన్లను టార్గెట్ చేసుకున్నారు. నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో షోలు వేసేలా ప్లాన్ చేసింది.
ఇక్కడే అసలు సమస్య
ఇప్పటి వరకు అన్ని బాగున్నాయనుకుంటున్న సమయంలో మరో సమస్య ఎదురు కాబోతున్నది. అదే రోజు హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ సేమ్ డేట్ రిలీజ్ కాబోతున్నది. సూపర్ హీరో జానర్ లో రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బ్యాట్ మ్యాన్ కూడా ఉండడంతో ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. డీసి సంస్థ కావడంతో యూఎస్, యుకె లాంటి దేశాల్లో భారీగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా వారి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదిపురుష్ తక్కువ స్క్రీన్లతో అడ్జెస్ట్ కావాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంతో టీ సిరీస్ బయ్యర్లు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ట్రైలర్లో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాకు తిరుగులేదని, ఫస్ట్ డే థియేటర్ కు వెళ్లాల్సిందేనంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది కూడా త్రీడిలో రావడం మరింత ప్లస్ కానుంది.
హాలీవుడ్ మూవీని తట్టుకొని ఓవర్సీస్ లో నిలబడాలంటే మొదటీ ఆట నుంచే ఎక్స్టార్డీనరి టాక్ తెచ్చుకోవాలి. ఇండియాలో కలెక్షన్లకు ఎలాంటి సమస్య లేదు. కావాల్సినన్నో షోలు వేసుకునే అవకాశం ఉంది. ఇసారి ఓవర్సీస్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఆదిపురుష్ తేల్చనుంది.