25.9 C
India
Monday, December 15, 2025
More

    Kalki 2898 AD : కల్కిలో మరో టాలీవుడ్ స్టార్?

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD Vijay Devarakonda

    Kalki 2898 AD : ప్రభాస్  అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో కల్కి ఒకటి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ వస్తున్నది. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది కొన్ని విషయాల్లో మాత్రం స్పష్టత రావడం లేదు.  పురాణాల స్ఫూర్తితో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్ లో   దర్శకుడు నాగ్ అశ్విన్ కథను తీర్చిదిద్దారు.  అశ్వత్థామ పాత్రలో అమితాబ్ లుక్ బయటకి వచ్చినప్పటి నుంచి అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారని రూమర్లు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటిదాకా దర్శకుడు నాగ్ అశ్విన్ కానీ, నిర్మాతలు కానీ పెద్దవి విప్పడం లేదు. అయితే ఈ సినిమాలో  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని రూమర్ల వస్తున్నాయి.  విజయ్ పాత్ర మహాభారంలోని అర్జునుడి పాత్రని పోలి ఉంటుందని టాక్.

    ఇందులో విజయ్ దేవరకొండది అతిథి పాత్ర అనే ప్రచారం సాగింది. అది గెస్ట్ రోల్ కాదని, పూర్తి నిడివి వున్న పాత్రలోనే విజయ్ కనిపిస్తారని సమాచారం.  కథలో ఆ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇందులో దుల్కర్ సల్మాన్ కనిపించే పాత్ర కూడా పురాణాల నేపథ్యంలో  తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

    రూమర్లు వచ్చిన వారంతా వారికి సన్నిహితులే..
    ఇక ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. మహేష్ బాబును హీరోగా లాంచ్ చేసింది వైజయంతి మూవీస్. ఆ స్నేహంతో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ ఓ కీలక పాత్ర చేశాడు. దుల్కర్ సల్మాన్ సైతం మహానటిలో చేశారు. ఆ సాన్నిహిత్యంతోనే  ఈ భారీ ప్రాజెక్టులో వారు భాగమవుతున్నారని సమాచారం. ఇక  జూన్ 27న కల్కి మూవీ  సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ రోజు ట్రైలర్  రిలీజ్ చేయనున్నారు. ఇందులో కథ, కథనాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...