Anupama :
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్.. ఈమె బేసిక్ గా మలయాళీ అయినప్పటికీ తెలుగు బ్యూటీ లానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి..
స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగక పోయిన ఈమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది అని ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు. అయితే ఎప్పుడైతే రౌడీ బాయ్స్ మూవీ వచ్చిందో అప్పటి నుండి ఈ భామ కూడా గ్లామర్ పరంగా రాణించేందుకు అడుగులు వేస్తుంది అని తెలిసింది.
అప్పటి వరకు ఈ భామ బోల్డ్ సీన్స్ లో నటించదు అని అనుకున్న వారికీ షాక్ ఇస్తూ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు ఈమె డీజే టిల్లు 2 చేస్తుంది దీంతో ఇందులో ఇలాంటి సీన్స్ చాలానే ఉంటాయి.. వాటిని చేసేందుకు ఈమె రెడీ అయిపోవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేక ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఈమె స్పందిస్తూ..
నా కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న.. నటిగా నేను హద్దులు పెట్టుకుని ఒక దగ్గరే ఆగిపోవడం ఇష్టం లేదు.. అన్ని సీన్స్ లో నటించాలని నిర్ణయించుకున్నా.. అందుకే లిప్ లాక్ సీన్స్ లో నటిస్తున్న.. నా కంటే ముందే చాలా మంది హీరోయిన్స్ ఇలాంటివి చేసారు.. వారిని ఎందుకు ట్రోల్స్ చేయడం లేదు.. వారు చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే తప్పా.. నన్ను ఎందుకు నెగిటివ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదంటూ ఈమె చెప్పుకొచ్చింది.