24 C
India
Sunday, October 11, 2026
More

    Miss Shetty Mr. Polishetty : భోళాశంకర్, బ్రో చిత్రాల మధ్య అనుష్క సినిమా నిలబడుతుందా?

    Date:

    Miss Shetty Mr. Polishetty :
    తెలుగు సినీ పరిశ్రమలో అందమైన హీరోయిన్ అంటే ఠక్కున చెప్పే పేరు అనుష్క. తన అందంతో అందరి మతులు పోగొడుతుంది. తన గ్లామర్ తో అందరిని మెప్పించింది. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక శైలితో దూసుకెళ్తోంది. బాహుబలిలో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. చాలా కాలం తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    ఈ సినిమాకు మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తయింది. ఇక విడుదల చేయడమే మిగిలి ఉంది. కానీ వేసవిలో విడుదల చేయాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఆగస్టు 4న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో తన ఉనికి చాటుకోనుంది.

    జులై 28న పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ల బ్రో, ఆగస్టు 8న చిరంజీవి నటించిన భోళాశంకర్ విడుదల కావడంతో వీటి స్పీడ్ ను అనుష్క సినిమా తట్టుకుంటుందా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో మళ్లీ అనుష్క సినిమా విడుదల సందిగ్ధమే. ఎందుకంటే అగ్రహీరోల సినిమాల మధ్య అనుష్క సినిమా నిలవడం కష్టమే. అందుకే అనుష్క సినిమా మరోమారు వాయిదా పడుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో అనుష్క సినిమా పరిస్థితి ఏంటి అనే సందేహాలు రావడం కామనే. అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్ ల సినిమాలు వరుసగా రావడంతో ఇక ఇతర సినిమాల ప్రస్థానం హుళక్కే. దీంతో వారి సినిమాలు కాస్త వెనకకు జరుపుకోవడమే సమంజసం. ఈ క్రమంలో చిత్రం యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

    Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...