
ఆయనకు ఏపీ బీజేపీలోని ఓ వర్గం మద్దతు బలంగా ఉంది. అయితే సోము వీర్రాజు కు మరో వర్గం అండగా ఉంది ముఖ్యంగా సునీల్ ధియోధర్ ఆయనకు సపోర్ట్ గా ఉన్నారు.. అయితే ఏపీ అసలు ఇంచార్జీ మురళీధర్ రావు రాష్ట్రం గురించి పట్టించుకునేది తక్కువే. అందుకే సునీల్ హవా నడిపిస్తూ ఉంటారు. ఆయన సోము వీర్రాజు వైపే నిలుస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని కూడా ఇటీవల సదరు నేత ప్రకటన విడుదల చేశారు.
కానీ జీవీఎల్, ధియోధర్, సోము వీర్రాజు ఓ గ్రూప్ అని పేరుంది. వీరంతా వైసీపీ కోసం పని చేస్తూంటారని టాక్. ఇటీవ కాలంలో సత్యకుమార్ రూపంలో నాయకుడు వచ్చారు. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉండే సత్యకుమార్ .. ఏపీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఎక్కువగా రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అయితే అన్ని వివరాలను అధిష్టానం తెప్పించుకుంటున్నది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో అధిష్టానం బలమైన నేతను రాష్ట్రంలో తెరపైకి తేవాలని భావిస్తున్నది. దీంతో నైనా ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.
ReplyForward
|