

AP CID notices to Ramoji Rao and Sailaja Kiran :
మార్గదర్శి స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు మరో సంస్థకు తరలిస్తున్నారంటూ గతంలో ఏపీ సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు దీనిపై విచరాణ చేపట్టారు. రామోజీరావు, మార్గదర్శి ఎండీ, ఆయన కోడలు శైలజా కిరణ్ ను విచారిస్తున్నారు. గతంలో రామోజీరావు ఆస్తులను కూడా సీఐడీ అటాచ్ చేసుకుంది.
మార్గదర్శికి సంబంధించి లావాదేవీల విషయంపై శైలజా కిరణ్ ను సీఐడీ గతంలో ప్రశ్నించింది. చందాదారుల నగదు ఎక్కడికి తరలిస్తున్నారు. అన్న కోణంలో అధికారులు పలు విషయాలను రాబట్టినట్లు తెలిసింది. గతంలో రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసుకున్న సీఐడీ మార్గదర్శి ఆస్తులను కూడా అటాచ్ చేసుకుంది. దాదాపు మార్గదర్శికి సంబంధించి రూ. 793.50 కోట్ల విలువైన చరాస్తులను సీఐడీ అటాచ్ చేసుకుంది. ఈ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. గతంలో ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు మాత్రం దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ఇచ్చేందుకు నిరాకరించింది.
మార్గదర్శి స్కాంకు సంబంధించి రామోజీరావు మొదటి నిందితుడు (A1) కాగా, రెండో నిందితురాల (A2) ఆయన కోడలు శైలజా కిరణ్. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ రామోజీరావుకు 41-A(1)Cr.P.C నోటీస్ పంపించింది. దీని ప్రకారం ఆయన, ఆయన కోడలు 7 జూలై, 2023న ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూర్ జిల్లా, కన్నవారి తోట, మెడికల్ కాలేజీ వెనుక ఉన్న సీఐడీ రీజినల్ ఆఫీస్ కు రావాలని నోటీసులు సర్వ్ చేసింది. ఇందులో కూడా ఇద్దరిని ఈ అధికారులు ప్రశ్నించనున్నారు.






