- ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాలకు హాజరు
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్ళానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ మహాసభలకు సినిమారంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, మురళీ మోహన్ తదితరులు వస్తున్నారు.