
AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా మొదలైంది. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అమలు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఇదే. మేనిఫెస్టోలో అమలు చేసిన తొలి హామీని వేగంగా అమలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మహోత్తరమైన కార్యక్రమంలో సీఎంతో ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ కూడా ఉన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం అర్హుల ఇంటికే వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీంతో సీఎం వస్తున్నారని మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీరి సామాజిక భద్రత కోసం తమ ప్రభుత్వం పింఛన్ పెంచుతుందని చంద్రబాబు ప్రకటించారు. అయితే గతంలో వీరికి ప్రభుత్వం రూ. 3000 కూడా ఇవ్వలేదు. కానీ బాబు ప్రభుత్వం పెంచిన మొత్తం రూ. 4,000 అందజేస్తున్నారు. అయితే పెంచిన మొత్తం కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.
ఇచ్చిన మాట మేరకు ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించి మూడు నెలలకు రూ. 12 వేల చొప్పున ఈ నెల జూలై కలుపుకొని రూ. 4000 మొత్తం రూ. 16000 నెలకు లబ్ధిదారులకు అందాయి. అయితే గత ప్రభుత్వం నెలకు అందజేసిన రూ. 3000 వేలకు అదనంగా రూ. 1000 కలిపి జూలై నెలకు చెల్లించాల్సిన 4,000తో రూ. 7000 లబ్ధిదారులకు మంజూరు చేసింది.
వికలాంగులకు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా రూ. 3,000 పింఛన్ అందుతుండగా అది ఇప్పుడు రెట్టింపైంది. ఈ మొత్తం నేటి నుంచే పంపిణీ చేస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వీల్ చైర్ కు పరిమితమైన వారికి పింఛన్ భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి రూ. 5,000 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ఇప్పుడది రూ. 15,000 పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం. పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు గారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందచేసిన సీఎం .#PensionsPandugaInAP #NTRBharosaPension… pic.twitter.com/QlMpdGpQen
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024