
AP elections : ఏపీలో ఏం జరగబోతున్నది. ఎన్నికలకు మరో ఏడాది గడువు మిగిలి ఉండగానే ఏపీలో ముందస్తు బాంబు పేలనుందా..? దీనిపై ఈనెల 7న జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారా..ఇప్పటికే కేంద్రం నుంచి ఆయన అనుమతి తెచ్చుకున్నారా.. అంటే అవుననే సమాధానం స్పష్టంగా వినిపిస్తున్నది. ఆయన ప్రస్తుత అడుగులు ముందస్తు వైపునకే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన సన్నిహితులైన మంత్రలు, కొందరు అనుయాయులకు ఈ దిశగా సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తేనే తమకు లాభిస్తుందని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది. టీడీపీపై అంతగా ఆదరణ పెరగనప్పటికీ, ప్రత్యమ్నాయంగా కనిపిస్తే ఇక తిరుగుండదని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రత్యర్థుల పొత్తు ముచ్చట్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికలు జరగాలంటే కేంద్రం సహకరించాలి. తను ముందస్తుకు వెళ్లాలని భావించి, ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆరో నెలల పాటు రాష్ర్ట పతి పాలన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈనేపథ్యంలోనే కేంద్ర పెద్దలతో మాట్లాడి వారి నుంచి అనుమతి పొందాకే ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అక్కడ ఢిల్లీలో భేటీ పూర్తవగానే, ఈ నెల 7న మంత్రి వర్గ భేటీకి అంతా సిద్ధంగా ఉండాలని అక్కడి నుంచే జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇక ముందస్తు అంశం బయటకు వచ్చింది.
అయితే జగన్ కదలికలను పసిగట్టిన చంద్రబాబు సడెన్ గా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. భేటీ అంశాలను రహస్యంగా ఉంచినా, వారి సహాయాన్ని కోరినట్లు అంతా అనుకుంటున్నారు. చంద్రబాబు ఏది చేసినా కొంత రహస్యంగానే ఆయన ప్రణాళికలు ఉంటాయి. 2019 లో ఓటమి తర్వాత ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. గంట పాటు ఆయన అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యారు. వారితో ఏపీ పరిస్థితిని చర్చించారు. అదే విధంగా రాష్ర్టంలో కలిసి ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పినట్లుగా సమాచారం. అయితే జగన్ ముందస్తుకు వెళ్తున్నారనే సమాచారంతోనే చంద్రబాబు పొత్తుల అంశంపై స్పీడప్ పెంచినట్లు తెలుస్తున్నది. రి ఈనెల 7న ఏపీలో ఎలాంటి సంచలన నిర్ణయం బయటకు వస్తుందోననే చర్చ అంతా సాగుతున్నది.
జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తేనే, ఆ ఐదు రాష్ర్టాలతో పాటు ఏపీకి ఎన్నికలు జరుగుతాయి. లేదంటే ఇక ఏడాది వరకు ఆగాల్సిందే. ఓ వర్గం ప్రజల్లో ప్రస్తుతం జగన్ పై కొంత సానుకూలత ఉన్నా, చంద్రబాబు ను నమ్మడానికి లేదని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈలోపు ఏ చిన్న వ్యతిరేకత వచ్చిన అది ఆయనకు లాభం చేకూరుస్తుందని ఆయన అనుమానిస్తున్నారు. దీంతోనే ముందస్తుకు రెడీ అవుతున్నారని సమాచారం. మరి ఈ నెల 7న ఎలాంటి ప్రకటన రానుందో వేచి చూడాలి.






