Inter- Net : ఆధునిక యుగంలో ఇంటర్ నెట్ లేనిది ఏ పని జరగడం లేదు. పుట్టినప్పటి నుంచి జనన ధ్రువీకరణ పత్రం నుంచి చనిపోయిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవడం కూడా ఇప్పుడు కంప్లీ్ట్ నెట్ లోనే చేస్తున్నారు. ఇక జీవితంలో ఇప్పటి జనరేషన్ ప్రకారం ఊహ తెలిసినప్పటి నుంచి సెల్ ఫోన్ తోనే పెరుగుతున్నారు. సెల్ ఫోన్ లేనిది ఎవరూ కనీసం నిద్రపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం సినిమాలు, న్యూస్, ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని ఒక్క మీటలోనే జరిగిపోతున్నాయంటే కారణం సెల్ ఫోన్ మాత్రమే.
ఇంటర్ నెట్ వాడాకాన్ని అత్యధికంగా అందిపుచ్చుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ ఇంటర్ నెట్ వినియోగ రంగంలో దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది. సబ్ స్క్రిప్షన్, ఇంటర్ నెట్ వినియోగంలో దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. శాఖ విడుదల చేసిన 2022–23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదికలో ప్రతి వంద మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్ ఉండగా ఒక్క ఏపీలో మాత్రమే ప్రతి వంద మందికీ 120.33 ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశ సగటు, ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని నివేదిక తెలిపింది. దేశంలో 2018–19లో ప్రతి వంద మందికి 47.94 ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 59.97కు పెరిగింది.
రాష్ట్రంలో 2018–19లో ప్రతి 100 మందికి 94.59 సబ్ స్క్రిప్షన్ ఉండగా 2022–23 నాటికి 120.33 సబ్ స్క్రిప్షన్ లకు పెరగింది. ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో సబ్ స్క్రిప్షన్ నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానం కేరళ ఆక్రమించింది. కేరళలో కూడా ప్రతి 100 మందికి 87.50 సబ్ స్క్రిప్షన్ ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్ 85.97 సబ్ స్క్రిప్షన్, పశ్చిమ బెంగాల్‌లో అతి తక్కువగా 41.26 సబ్ స్క్రిప్షన్ ఉన్నట్లు నివేదిక తేటతెల్లం చేసింది. రాష్ట్రంలో 2019–20 నుంచి ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్ పెరుగుతూనే ఉంది. 2021–22లో అంతకు ముందు సంవత్సరానికన్నా కొంత తగ్గినప్పటికీ మరుసటి ఏడాది పెరిగింది.
ReplyForward
|