AP News : ఒంగోలు జిల్లాలో రేషన్ పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైనా కార్డుదారులకు అందాల్సిన కందిప ప్పు మాత్రం కనిపించ లేదు. ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి అరకొరగానే సరఫరా చేస్తోంది. జిల్లా కు 590 టన్నుల రేషన్ కందిపప్పు అవసరం కాగా కేవలం 15 టన్నులు మాత్రమే అందుబాటు లో ఉండటంతో దాని పంపిణీని నిలిపివేశారు.
బియ్యం, పంచదారను మాత్రమే అందజేస్తు న్నా రు. జిల్లావ్యాప్తంగా 6,70,571 కార్డులు ఉండగా ఒక్కో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు, ఒక్కొక్క రికి ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదారను అందజేయాల్సి ఉంది. అయితే కందిపప్పు, గోధు మపిండి అవసరమైన మేర అందుబాటులో లేదు. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి సర్వర్ ఆటంకంగా మారింది. సర్వర్ పనిచేయక కార్డుదారులు గంటల తరబడి మొబైల్ వాహనాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయానికి 22,787 (3.39శాతం) కార్డుదారు లకు మాత్రమే సరుకులు అందాయి. పంపిణీలో రాష్ట్రంలో మన జిల్లా 18వ స్థానంలో ఉందంటే సర్వర్ ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.