Jagan’s Government :
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడుతున్నారు. ఏదో పనికి రాని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయించడం గొప్పతనం కాదని, ప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు అస్సలు మంచిది కాదని ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏపీని ఎంత డెవలప్ చేశాడో దేశం యావత్తు తెలుసని అంటున్నారు. వైఎస్ జగన్ పై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుకుంటూ పోతోంది.
ఈ నేపథ్యంలో మరోసారి పరిపాలనా రాజధాని అంశం తెరపైకి వచ్చింది. దసరా నుంచి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రారంభిస్తామని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో మరిన్ని నిరనసలు వ్యక్తం అవుతున్నాయి. ఏ వ్యక్తిని కదిలించినా చంద్రబాబు అరెస్ట్ జగన్ ప్రభుత్వం క్రూరత్వం గురించి మాట్లాడుతున్నరు. చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ ఏం చేయలేడని మండిపడుతున్నారు. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ మేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది.
వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఒక వీడియో హల్ చల్ అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారో.. రౌడీయిజం చేస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో మంత్రులు రోడ్డుపై డ్యాన్స్ లు చేయడం, సినిమా కలెక్షన్లపై మాట్లాడడం ఎమ్మెల్యేల ముందు రికార్డింగ్ డ్యాన్స్ లు ఇవా ప్రజా స్వామ్యానికి స్ఫూర్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుక్కున్నాడు కాబట్టే ఆయనను గెలిపించాం. చదువుకున్నోడు ఎవ్వడూ జగన్ కు ఓటెయ్యడు అంటున్నారు.