YCP Government :
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజల ఆస్తుల రిజిస్ర్టేషన్ల భాధ్యతలను పంచాయతీల సెక్రటరీలకు అప్పగించింది. ఇప్పటికే వారి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాన్ని మరింత తిప్పలు పెట్టేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే 2200 గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్ల డేటాకు సంబంధించిన యాక్సెస్ ను పంచాయతీ కార్య దర్శులకు అప్పగించింది.
1908 చట్టం అమల్లోకి..
అయితే పంచాయతీ కార్యదర్శులకు ఈ అధికారం అమల్లోకి తెచ్చేందుకు 1908 సెక్షన్ (6)ను ప్రభుత్వం అనుసరించింది. అంటే 115 ఏండ్ల నాటి చట్టాన్ని మళ్లీ బయటకు తీసి, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో అందుబాటులో ఉండే డేటాకు పంచాయతీ సెక్రటరీని కూడా యాక్సెస్ చేసే అవకాశం కల్పించింది. అయితే ఈ విషయంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజల ఆస్తులతో ముడి పడి ఉన్న అంశం. స్టాంపు చట్టం, రిజిస్ర్టేషన్ల ప్రక్రియ, వాల్యూయేషన్, ఇతర ప్రక్రియలపై పూర్తి అవగాహన ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అయితే కేవలం 6 నెలల శిక్షణ పేరుతో ఈ ప్రక్రియను ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. ఇప్పటికే వారు గ్రామాల్లో చాలా పనులను పెండింగ్ లో పెట్టి ప్రజలను వేధిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆస్తుల ప్రక్రియ కూడా కట్టబెడితే ఇక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అయితే రిజిస్ర్టేషన్ అంటే మాములు ప్రక్రియ కాదు. వేలిముద్రలు, ఫొటోలు, డేటా, నంబర్ కేటాయింపు,ఇలా ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఒక్క పంచాయతీ కార్యదర్శే ఇవ్వన్నీ చేయాలంటే ఒక్కో డాక్యుమెంట్ కు గంటల తరబడి పడుతుంది. ఇలా చేసుకుంటూ పోతే ఇక పని అయినట్లేనని అంతా అనుకుంటున్నారు.. ఇక ఓటరు జాబితాలోలాగే తమ ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తెచ్చిందని మెజార్టీ జనం మండిపడుతున్నది. పంచాయతీ కార్యదర్శులకు రిజిస్ర్టేషన్ల ప్రక్రియను అప్పగించవద్దని డిమాండ్ మాత్రం ఏపీ ప్రజల నుంచి వినిపిస్తున్నది.