Inspiration of Chandrababu : చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన నేత కాదని, ఆయన దేశానికి, అతెందుకు ప్రపంచానికి ఉత్తేజం కలిగించే నేత అని అపోలో హాస్పిటల్స్ ఫౌండర్, అండ్ చైర్మన్ ప్రతీప్ చంద్రారెడ్డి అన్నారు. ఆయన ఇటీవల జైలు జీవితం గుడుపుతుండడం తనను బాగా కలిచివేసిందని అన్న ప్రతాప్ చంద్రారెడ్డి అపోలో హాస్పిటల్స్ డెవలప్ మెంట్ లో ఆయన చేసిన కృషిని పంచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఇంత డెవలప్ అయ్యిందంటే కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఆయన విజన్ ఉన్న నేత అని కొనియాడారు.
చిత్తూరు జిల్లా, అరగొండ నుంచి వచ్చిన నేను ఇప్పుడు అపోలో సామ్రాజాన్ని సృష్టించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు యంగ్ హీరోగా ఉన్నప్పటి నుంచే తనకు తెలుసు అన్నారు. ఇక ఆ కాలంలో ఆయన చేసిన కార్యక్రమాల గురించి చెపితే మాటలు సరిపోవన్నారు. ఆయన మాటలే తనపై ప్రభావాన్ని చూపాయని చెప్పారు. అప్పట్లో ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ కు ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చారన్నారు. అందుకు ఆయన రోజుకు 14 గంటల వరకు పని చేసేవారని చెప్పారు.
అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇక్కడికి (హైదరాబాద్) వచ్చిన సందర్భం ఇప్పటికీ నాకు గుర్తుంది అన్నారు. ఆ సమయంలో అపోలో హాస్పిటల్ తరుఫున శాటిలైట్ మెడిసిన్ ప్రారంభించామని చెప్పారు. తన స్వగ్రామం అరగొండ లోని పేషంట్ ను హైదరాబాద్ నుంచి కార్డియాలజీ డాక్టర్ పరీక్షించారని గుర్తుకు చేసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు టెక్నాలజీని హైదరాబాద్ కు తేవడం వల్లే ఫలించిందన్నారు. ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. మన వాళ్లు (తెలుగు) విదేశాలకు కూడా వెళ్లి మంచి పొజిషన్ లో ఉండాలని అనేవారు.
ఆయన మాటలను ఇన్పిరేషన్ గా తీసుకునేను అరగొండలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాలు చేసినట్లు చెప్పారు. ఇందులో చదువుకున్న వందలాది, వేలాది మంది నేడు విదేశాలకు వెళ్లి మంచి మంచి హాస్పిటల్స్ లలో తమ సేవలను అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.