
face beautiful : ఎండాకాలంలో ఎండలకు మన ముఖం నల్లగా మారుతుంది. ఎండలో చెమటకు జిడ్డులా అవుతుంది. దీంతో ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. దీంతో మన ముఖం మళ్లీ తెల్లగా మారుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే చిట్కా ఏంటని అందరు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
రెండు టీ స్పూన్ల అలొవేరా తీసుకోవాలి. అర టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనెను ఉపయోగించుకోవాలి. ఒక గిన్నెలో కలబంద జెల్ ను తీసుకుని అందులో తేనె, నిమ్మరసం వేసి కలపాలి. జిడ్డు చర్మం ఉన్న వారు మాత్రమే నిమ్మరసాన్ని ఉపయోగించుకోవాలి. పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసాన్ని వాడుకోవాలి.
రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఆరిన తరువాత సబ్బు ఉపయోగించకుండా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం సబ్బుతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎండ నుంచి మన వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుతుంది.
ముఖంపై పేరుకుపోయిన చనిపోయి కణాలు తొలగిపోతాయి. కాంతిహీనంగా మారిన ముఖం అందంగా తయారవుతారు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సులభంగా మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా వాడటం వల్ల మన ముఖం కాంతివంతంగా అవుతుంది.