
Araku coffee : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు నుండి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అరకు కాఫీకి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా పార్లమెంట్ సభ్యులు మరియు సందర్శకులకు ఈ స్టాళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. నాణ్యమైన అరకు కాఫీని ఆస్వాదించడానికి ఇవి వేదిక కానున్నాయి.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని అమరావతిలో కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో ఈ స్టాళ్లు ఏర్పాటు కావడం విశేషం.