
Apples dangerous : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. ఇందులో ఉండే పోషకాలు అలాంటివి. పొటాషియం, ఫైబర్, విటమిన్ సి ఉండటం వల్ల ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. మన ఆరోగ్యానికి ఆపిల్ ప్రయోజనం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆపిల్ తీసుకుని మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
ఆపిల్ ను ఎక్కువగా తింటే నష్టాలే వస్తాయి. ఏదైనా అతిగా తినకూడదు. అందుకే మితంగా తినడం వల్ల మనకు లాభాలుంటాయి. అతిగా తినడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా ఆపిల్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మన డైట్ లో రోజు వీటిని చేర్చుకుంటే చాలు.
ఆపిల్స్ అధిక మొత్తంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక బరువుతో ఇంకా అనర్థాలే వస్తాయి. ఆపిల్స్ ఎక్కువగా తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే సూచనలుంటాయి.
రెండు కంటే ఎక్కువ ఆపిల్స్ తీసుకుంటే దంత సంబంధమైన సమస్యలు వస్తాయి. దంతాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అధికంగా తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీంతో ఆపిల్స్ అధికంగా తీసుకోవడం వల్ల చిక్కులు వస్తాయి. అందుకే మితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.