
Indian travelers : అమెరికా, కెనడా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు యూకే షాక్ ఇచ్చింది. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూకే కానీ యూరప్ లో కానీ దిగితే ఎయిర్ పోర్టులో కూడా వారు ఈటీఏ వీసాలాంటి దాన్ని తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంలో అడుగుపెట్టాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. జనవరి 2025 నుంచి చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు యూకే లో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా దిగితే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిని పొందాలని UK ప్రభుత్వం ETA పథకాన్ని ప్రవేశపెట్టింది.
ETA రూల్స్ ప్రకారం జనవరి 8, 2025 నుండి వీసా-మినహాయింపు ఉన్న దేశాల నుండి యూరోపియన్ కాని పౌరులు ఖచ్చితంగా ఈ ఈటీఏ తీసుకోవాలని అమలులోకి వచ్చింది. ETA అవసరం ఏప్రిల్ 2, 2025న చాలా యూరోపియన్ దేశాలకు విస్తరించబడుతుంది.
భారతదేశం , చైనాతో సహా కొన్ని దేశాలు ETAకి అర్హత పొందలేదు. వీరు ఖచ్చితంగా 10 డాలర్ల వరకూ చెల్లించి అనుమతి పొంది ఈటీఏ తీసుకోవాలి. దీనికి వీసా అవసరం కొనసాగుతుంది. మీరు UK ETA వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ETA కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ETA అనేది ప్రయాణికుల పాస్‌పోర్ట్‌తో అనుసంధానించబడిన డిజిటల్ అనుమతి. ETA ధర £10 పౌండ్లు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఒకేసారి ఆరు నెలల వరకు UKలో ప్రవేశాలను ఈటీఏ అనుమతిస్తుంది