
Love marriages : ప్రేమ ఒక అందమైన అనుభూతి. మాటలకందని ఊహ. ఎన్నో ఊసులకు ప్రత్యక్ష నిదర్శనమే ఇది. దీంతో చాలా మంది ప్రేమలో పడుతుంటారు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటారు. కానీ కడదాకా నడవరు. దీంతో మధ్యలోనే వారి ప్రేమ కాలగర్భంలో కలిసిపోతుంది. దీంతో ప్రేమ వివాహాలకు యువత మొగ్గు చూపుతున్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. దీంతో ప్రేమ మీద మంచి అభిప్రాయం కలగడం లేదు. మనదేశంలో విడాకులు ప్రేమ వివాహాల్లోనే ఉంటున్నాయి.
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. ప్రేమికుల్లో సహనం నశిస్తోంది. దీని వల్ల ఇద్దరి మధ్య అవగాహన కుదరడం లేదు. ఇగో సమస్యలతో ఇద్దరు విడిపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమించుకునే సమయంలో ఇద్దరి మధ్య ఎన్నో మంచి మాటలు తరువాత క్రమంలో తిట్ల దండకాలే ప్రధానంగా మారుతున్నాయి. దీంతో ఇద్దరు చివరిదాకా కొనసాగడం లేదు.
దంపతుల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ప్రేమికులు ప్రేమించుకున్న నాడు ఉన్న ప్రేమ కడదాకా ఉండటం లేదు. పెళ్లి చేసుకున్న తరువాత అనుబంధం పెరగడం లేదు. పలితంగా మధ్యలోనే సంసారం వదిలేస్తున్నారు. కష్టసుఖాలు కావడి కుండలు అని తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంతో ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది విడాకులు తీసుకునే వారిలో ప్రేమికులే ఉంటున్నారని చెబుతున్నారు. విడాకులకు కారణం ప్రేమ వివాహాలేనని తేల్చారు. ఇలా ప్రేమికులు విడిపోవడంపై ఆందోళన నెలకొంటోంది. దంపతుల మధ్య ప్రేమ ఇంకా పెరగాలి కానీ విడిపోవడం పరిష్కారం కాదని సూచనలు చేసింది.