- అల్లుడి కోసమే అన్న కొడుకుకు బాలయ్య దూరం

Nandamuri family : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హైదరాబాద్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సినీ రంగంతో పాటు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నందమూరి కుటుంబం అంతా హాజరైంది. అయితే ఈ వేడుకకి నందమూరి హరికృష్ణ కుటుంబం మాత్రం రాలేదు. కాగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబాలకు ఏ మాత్రం పొసగదు. ఆ రెండు కుటుంబాలు కూడా వేదికను పంచుకున్నాయి. సినీ రాజకీయ రంగ ప్రముఖులు వేదికపై ఎన్టీఆర్ కీర్తిని, ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సినిమా అయినా రాజకీయమైనా తన మార్కు చూపించాల్సిందే..
తెలుగు సినీ తెరపై శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, రావణాసురుడిగా, భక్తుడిగా ఎన్నో పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. పౌరాణికం, జానపదం, సాంఘికం, కమర్షియల్ చిత్రాల్లో తనదైన మార్కు చూపించారు ఎన్టీఆర్. అలాగే రాజకీయాలకు కొత్త నడవడికను నేర్పించారు. సంక్షేమ పథకాలు, కొత్త చట్టాల రూపకల్పనతో తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప రాజకీయ వేత్త.
సినీ, రాజకీయ ప్రముఖుల కలబోతగా నిర్వహించిన వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. వేదిక ఏదైనా తాతను తలుచుకోలేకుండా ఒక్క మాట కూడా మాట్లాడని జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలకు రాకపోడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి కుటుంబం పేరు నిలబెట్టడంలో బాలకృష్ణ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే. నటనలోనూ, వాక్చాతుర్యంలోనూ తాతకు తగ్గ మనువడు యంగ్ టైగరే.. అలాంటి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎందుకు రాలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నయి.
కాగా ఆ రోజు జూనియర్ పుట్టినరోజు కావడంతో రాలేదని కొందరు చెబుతుండగా పరోక్షంగా నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ కారణమనే పలువురు పేర్కొంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు. తాను వెళితే బాబాయ్ నొచ్చుకుంటారేమో, అనువుగాని చోట తాను ఉండడం ఎందుకని ఎన్టీఆర్ భావించి వెళ్లకపోయి ఉండవచ్చనే అభిప్రయాలు వ్యక్తవుతున్నాయి.
తమ్ముడు వెళ్లని వేడుకకు తానెందుకు వెళ్లడం అనే భావనలో కళ్యాణ్ రామ్ భావించి హాజరుకాలేదని తెలుస్తున్నది. పైకి తామంతా ఒక్కటేనని నందమూరి కుటుంబం చెబుతున్నా లోలోపల అంతర్గత కలహాలు అలాగే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన అల్లడు నారా లోకేష్కు ఎన్టీఆర్ నుంచి రాజకీయంగా థ్రెట్ తప్పేలా లేదని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. కేవలం తన అల్లుడి రాజకీయ భవిష్యత్ కోసం అన్న కొడుకుని దూరం పెడుతున్నాడేమననే సందేహాలు వ్యక్తవుతున్నాయి.