Mangalagiri : ప్రస్తుతం వైసీపీలో కుట్రలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తమకు పడని వారిని పక్కకు తప్పించే పనికి పూనుకుంటున్నారు. సొంత పార్టీ అయినా తమ పనులకు అడ్డుగా నిలిస్తే పక్కకు తప్పించడానికే మొగ్గు చూపుతున్నారు. మంగళగిరిలో రాజకీయాలు మారుతున్నాయి. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కేని ఓడించడానికే పలు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇందులో నిజం ఉందన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో ఇదివరకు జరిగిన పనులకు బిల్లులు ఇప్పించేందుకు ముందుకు రావడం లేదు. రెండు సంవత్సరాలుగా సమస్యలు పరిష్కరించాలని ఆర్కే కోరినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన ఆర్కే పార్టీ నుంచి నిష్ర్కమించే వరకు వెళ్లింది.
మంగళగిరిలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. గ్రానైట్ మాఫియా రాజ్యమేలుతోంది. కబ్జాదారుల దురాగాతాలు ఆగడం లేదు. గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్యనేత ప్రభుత్వ సలహాదారులు ఏకమై సీఎం దగ్గర లేనిపోనివి చెప్పించి ఆర్కేని పార్టీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. రెండు ఏళ్లుగా సీఎం ఆర్కేను కావాలనే దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
తమ సామాజిక వర్గానికి ఓ వ్యక్తిని మంగళగిరిలో అభ్యర్థిగా నిలబెట్టాలని కుట్ర జరుగుతోంది. పద్మశాలికి చెందిన ఓ నేతను ఇక్కడ నుంచి పోటీకి దింపాలనుకుంటున్నారు. మంగళగిరిలో వ్యవహారాలన్ని టీడీపీ సూచించిన విధంగా జరుగుతున్నాయనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు కూడా రావడం సహజమే.