
Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రాజమౌళి – మహేష్ బాబు క్రియేటివ్ డిఫరెన్సెస్ వార్తలు అభిమానుల్లో కాస్త కలవరం కలిగిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు కథలో కొన్ని మార్పులు సూచించగా, రాజమౌళి తన స్టైల్ ప్రకారం స్క్రిప్ట్ లో మార్పులు చేయకూడదని భావించినట్టు సమాచారం. అయితే ఇది సాధారణమైన క్రియేటివ్ చర్చల పరంగా మాత్రమే జరిగిందా? లేక విభేదాల వరకు వెళ్లిందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తవగా, రెండో షెడ్యూల్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇండస్ట్రీలో అత్యంత ప్రొఫెషనల్ వ్యక్తులు కావడంతో, ఈ తేడాలను సమర్థవంతంగా పరిష్కరించుకొని సినిమా పనులను ముందుకు తీసుకెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ మూవీ పై ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి కాబట్టి, అభిమానులు మాత్రం ఇద్దరూ ఒకే పేజీ మీద ఉండాలని ఆశిస్తున్నారు.