
Malcha Mahal : ప్రస్తుత కాలంలో దెయ్యాలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఇది మిలియన్ డాలర్ ప్రశ్నే. కానీ అంతుచిక్కడం లేదు. కొందరు దెయ్యాలు ఉన్నాయని చెబుతారు. మరికొందరు అసలు దెయ్యాలు లేవని వాదిస్తారు. ఇందులో ఏది నిజం? దేన్ని నమ్మాలనే సందేహం అందరిలో రావడం ఖాయం. కానీ దెయ్యాల ప్రస్తావన వస్తే గంటల కొద్ది వాదించే వారు లేకపోలేదు. దీంతో దెయ్యాల మనుగడ ఉందా? ఎక్కడ ఉన్నాయి అనే అనుమానాలు అందరిలో రావడం సహజం.
తాజాగా ఢిల్లీలోని మాల్చా మహల్ దెయ్యాల కోటగా చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా పాడుబడిన బంగ్లాగా ఉన్నదీన్ని ఇటీవల కాలంలో పర్యాటక కేంద్రంగా చేసింది. చాణక్యపురిలోని అటవీ ప్రాంతంలో ఉండే ఈ మహల్ చూడటానికి కూడా దెయ్యాల కోటగానే కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎవరు కూడా దీని మీద శ్రద్ధపెట్టలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పలువురు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు. దీని టికెట్ ధర రూ.800 గా నిర్ణయించారు. అయినా టూరిస్టులు బాగానే వస్తున్నారు. దీంతో పలువురు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా దాన్ని సందర్శించింది. తరువాత రోజు నుంచి నాకు కలలో ఏదో దెయ్యం వస్తుందని చెబుతోంది. నిద్రలోనే ఉలిక్కిపడుతోంది.
రాజుల కాలం నాటి భవనం కావడంతో అందులో దెయ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో అప్పటి రాణి విలాయత్ బేగం ఆత్మ సంచరిస్తోందని అంటున్నారు. ఆమె ప్రభుత్వంపై 17 ఏళ్లు పోరాటం చేసి చివరకు ఈ మహల్ ను సొంతం చేసుకుంది. కొన్నేళ్ల పాటు అక్కడే ఉండి వజ్రాలు మింగి ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆత్మ ఇప్పుడు అందులో తిరుగుతోందని వాదిస్తున్నారు.
మొత్తానికి మాల్చా మహల్ లో దెయ్యాలు ఉన్నాయా? దాన్ని పర్యాటక ప్రాంతం చేయడంతో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? అక్కడ మరిన్ని సదుపాయాలు కల్పిస్తే దెయ్యాల గోల తప్పుతుందని అంటున్నారు. ఇలా మాల్చా మహల్ లో దెయ్యాలు ఉన్నాయనే వాదనలు రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.