
lettuce : చాలా మంది పాలకూర ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కూర, పకోడి, జ్యూస్ లా చేసుకుని తినడం మామూలే. కానీ పాలకూర అధికంగా తింటే అనర్థమే. దీనివల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉంటాయి. పాలకూర ఎక్కువగా తింటే కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. అందుకే ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్న వరు పాలకూర తినొద్దు. తింటే శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాల్షియం ఆక్సలేట్ గా మారి కిడ్నీలో రాయిగా తయారవుతుంది. రోజు పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల శరీరం అలసిపోతుంది. శక్తి సన్నగిల్లుతుంది. నీరసంగా అనిపిస్తుంది. దీంతో కీళ్లలో వాపు వస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలకూర తీసుకోవద్దు.
పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. డయాబెటిస్ రోగులు కూడా పాలకూరకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. పాలకూరలో హిస్టమిన్ అనే ఎలర్జీ కారకం ఉంటుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. పాలకూరను ఎక్కువగా తీసుకుంటే బీపీ, రక్తంలో చక్కెర లెవల్స్ తగ్గుతాయి.
పాలకూర చాలా మందికి పడదు. ఇందులోని పోషకాలు చాలా మందికి అవసరం. కానీ కొందరికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో పాలకూర తినేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. పాలకూరలో ఇన్నిరకాల సమస్యలు ఉన్నందున పడిన వారు తీసుకుని పడని వారు మాత్రం దూరంగా ఉండటమే శ్రేయస్కరం.