Beating coconut : దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొబ్బరి కాయ కొట్టడం మామూలే. ఏదేవుడైనా దేవతైనా కొబ్బరి కాయ కొట్టి ప్రార్థించడం సహజమే. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహా ఇష్టమట. అందుకే అందరు ఆమె ముందు కొబ్బరికాయ కొట్టి వేడుకుంటారు. తమను రక్షించు మాతా అని వేడుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను దూరం చేయాలని కోరడం చేస్తుంటారు.
భక్తులు లక్ష్మీదేవి, నారాయణుడి ముందు కొబ్బరి కాయ కొట్టి పూజిస్తారు. శివపార్వతులకు కూడా అలాగే చేస్తారు. ఏ దేవుడైనా సరే కొబ్బరికాయకు లొంగాల్సిందే. భక్తుల కోరికలు వినాల్సిందే. అలా కొబ్బరికాయతో తమ కష్టాలు తీర్చాలని వేడుకోవడం సబబే. మన ధర్మం ప్రకారం పూజ చేసినా, వ్రతంచేసినా కొబ్బరి కాయ కొట్టడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కొబ్బరికాయ భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా నిలుస్తుంది.
కొబ్బరి కాయలో త్రిమూర్తులు కొలువుంటారని చెబుతారు. కాయమీద ఉండే మూడు కళ్లే ఆ త్రిమూర్తులుగా భావించుకుంటారు. కొబ్బరి కాయ కొట్టడం వల్ల సమస్యలు దూరం అవుతాయని నమ్ముతుంటారు. చేతిలో డబ్బు నిలవడం లేదంటే శుక్రవారం ఉదయం తల స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవిని పూజించాలి. తరువాత కొబ్బరికాయ, తామరపువ్వు, తెల్లని వస్త్రాలు, పెరుగు మరియు తెల్లని స్వట్లు సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.
సమర్పించిన కొబ్బరికాయు శుభ్రమైన ఎర్రని గుడ్డలో చుట్టి ఎవరు చూడని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా పోతాయి. కొబ్బరికాయ సాయంతో ఇంట్లో ప్రతికూల శక్తులను దూరం చేసుకోవచ్చు. కొబ్బరికాయపై పిలకను తీసి ఇంట్లో ప్రతి మూలలో వేసిన తరువాత ప్రవహిస్తున్న నది నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దుష్ర్పభావాలు తొలగిపోతాయి.