
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది దోహదపడుతుంది. దీన్ని నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. కాకర కాయ తినడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి రోగాలకు కాకరకాయ కాపాడుతుంది. కాకరకాయ తింటే మనకు ఎన్నో రకాల సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరకాయ కీలకంగా ఉంటుంది. రక్తంలోని విషాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది దివ్యమైన ఆహారం. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కాకరకాయ రసం తాగితే చర్మం ఎక్స్ పోలియేట్ అవుతుంది. చర్మం కాంతివంతంగా మారేందుకు తోడ్పడుతుంది.
బరువు తగ్గేందుకు కూడా ఇది పరోక్షంగా సహకరిస్తుంది. కాకరకాయ రసం తాగితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వును తగ్గించి బరువును నియంత్రిస్తాయి. గుండె సంబంధ సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. కాకరకాయ తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని విటమిన్ల వల్ల కంటి సంబంధ వ్యాధులు దూరమవుతాయి.






