Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగతోంది. దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా అది హైలైట్ కావాల్సిందే. ప్రపంచ గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. మరి ఇటు వైపు అగ్ర నటుడు మహేష్ బాబుకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఇక ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో చూడాలనే కాంక్ష ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఇందులో భాగంగానే వీరి సినిమాపై ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
కథా పరంగా ఇంకా కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఆగస్టులో పూర్తి కథ సిద్ధమవుతుందని రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించడంతో సినిమా ప్రారంభానికి ఇంకా సమయం ఉందని తెలుస్తోంది. ఈ లోపు మహేష్ బాబు జిమ్ లో కసరత్తులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారా అని వారు కామెంట్లు పెడుతున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా నిర్మాణం జరుగుతోంది. దీని తరువాత రాజమౌళి సినిమా ఉంటుంది. ఆగస్టు 9 మహేష్ బాబు జన్మదినం సందర్భంగా షూటింగ్ ప్రారంభం చేసి వచ్చే సంవత్సరం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగించేందుకు రాజమళి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలం నుంచి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి కుదిరింది. కానీ కథ ఇంకా సిద్ధం కాకపోవడంతో వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏదిఏమైనా రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ కోసం ప్రేక్షకులు తపించిపోతున్నారు. ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు వీరు సినిమా తీస్తారోనని చూస్తున్నారు. వారి కలలు తీరడానికి ఇంకా సమయం పడుతుంది.
ReplyForward
|