Chicken In Fridge :
మనం పూర్వం రోజుల్లో కూరలు ఎప్పటికప్పుడే చేసుకునే వాళ్లం. ఇప్పుడు రోజులు మారాయి. ఫ్రిజ్ లు వచ్చాయి. దీంతో మనం కూరలను అందులో పెట్టుకుని రెండు మూడు రోజులు తినడం చేస్తుంటాం. ఈ నేపథ్యంలో మనం ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం వల్ల చాలా సమస్యలొస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫ్రిజ్ వాడకం అంత మంచిది కాదని తెలుసుకుని దాన్ని దూరం పెట్టడం లేదు.
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు దర్శనమిస్తున్నాయి. ఏది కొన్నా ఫ్రిజ్ లో పెట్టడం సాధారణంగా మారింది. చికెన్ ను కూడా వండుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని తింటున్నారు. దీని వల్ల బ్యాక్టీరియా అంటుకుంటుంది. మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఫ్రిజ్ తో మనకు చాలా రకాల రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
ఇలా మాంసాహారం నిలువ ఉంటే ప్రమాదకరమే. చెడు బ్యాక్టీరియా వ్యాప్తిచెంది ఆహారం కలుషితంగా మారుతుంది. కడుపులోకి చేరడం ద్వారా ఆహారం విషంగా అవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫ్రిజ్ లో నిలువ ఉంచిన మాంసం తింటే వాంతులు, విరేచనాలు అవుతాయి. తద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది.
నేటి రోజుల్లో అందరు ఫ్రిజ్ వాడుతున్నారు. దాని నుంచిచెడు బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇంట్లో ఫ్రిజ్ ఉంచుకోవడం అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఈ విషయం తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా కూరగాయలు, పాలు, పెరుగు, మాంసం ఏదిపడితే అది ఫ్రిజ్ లో పెట్టడం సహజమే. దీంతో మనకు పలురోగాలు వచ్చే వీలుంటుంది.