27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Sivaji Raja : డబ్బుల విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. పరిటాల రవి రమ్మన్నారంటూ  ఫోన్.. బయటపెట్టిన శివాజీరాజా

    Date:

    Sivaji Raja
    Sivaji Raja
    Sivaji Raja : తెలుగులో చిన్న చిన్న పాత్రలతో  కెరీర్ ప్రారంభించి హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు సీనియర్ నటుడు శివాజీరాజా. తెలుగు సినీ పరిశ్రమతో ప్రేక్షకులకు ఆయన తెలియనివారుండరు. శివాజీరాజా పలు చిత్రాల్లోనూ హీరోగా చేసినా కమర్షియల్ గా అనుకున్నంతగా బ్రేక్ రాలేదు. దీంతో ఆయన హీరోగా మానుకొని హీరోలకు ఫ్రెండ్ గా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా బిజీ అయ్యారు. నటుడిగా మంచి ఫామ్ లోగా ఉండగానే టీవీ సీరియల్లోకి ఎంటరయ్యారు. అప్పట్లో వచ్చిన ఒరెయ్ ఆంజనేయులు కామెడీ సీరియల్ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఆదివారం ప్రసారమైన ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు వేచి చూస్తూ ఉండేవారు.

    శివాజీ రాజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో జరిగిన గొడవ గురించి వెల్లడించారు. అప్పట్లో సినీ పరిశ్రమలోని కొంతమంది స్నేహితులతో  కలిసి హాస్య నటుడు బ్రహ్మానందం పేరు మీద ఓ  ట్రస్ట్ నెలకొల్పామని  చెప్పారు. అయితే ఆ ట్రస్టులోని డబ్బు కొంత పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ విషయం గురించి బ్రహ్మానందంతో చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయం కాస్త కలెక్షన్ కింగ్ మోహన్ బాబు,   టీడీపీ మాజీ  ఎమ్మెల్యే పరిటాల రవి తదితరుల దగ్గరికి చేరిందని తెలిపారు. వారు యాక్టర్ శ్రీహరితో తనకు ఫోన్ చేయించి  పిలిపించారని చెప్పారు.  డబ్బుల గురించి గొడవపై తనతో మాట్లాడగా విషయం సర్ధుమణిగిందని వారితో కూడా చెప్పానన్నారు.  ఈ విషయంలో కొందరు బ్రహ్మానందంతో గొడవలు గొడవ జరగడంతో ఇప్పటికీ మాట్లాడుకోవడం లేదని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో మొదటిసారి పరిటాల రవి ని దగ్గరి నుంచి చూశానని చెప్పారు.

    అయితే సినిమా ఇండస్ర్టీలో లోపల  జరిగేది ఒకటని, బయటకు మరోలా ప్రచారం అవుతుందని చెప్పారు. బ్రహ్మానందంతో తానెప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటానని, ఆయన కూడా తనతో పాటు చాలా మందితో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారని చెప్పారు. ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా అవి అక్కడికే సమసిపోతాయని వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu : పరారీలో మోహన్ బాబు.. పోలీసుల గాలింపు

    Mohan Babu : సినీ నటుడు మంచు మోహన్ బాబు కు తెలంగాణ...

    Mohan Babu apologizes : టీవీ9కు, మీడియాకు మోహన్ బాబు క్షమాపణ

    Mohan Babu apologizes : మీడియాపై దాడి చేసిన నటుడు మోహన్ బాబు...

    Manchu Manoj : వినయ్‌ వల్లే తమ కుటుంబంలో వివాదాలు : మంచు మనోజ్‌

    Manchu Manoj : వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు...

    Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు పై కేసు నమోదు?

    Manchu Mohan Babu : మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో...