
Arogya Shri : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పేదవారికి అండగా నిలిచే సేవలు ప్రస్తుతం బంద్ కానుండటంతో పేదవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఆరోగ్యశ్రీ. దీంతో పేద వారికి ఏ జబ్బు చేసిన ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు తీసుకోవడం జరుగుతుంది.
ఆరోగ్య శ్రీ పథకం పేదలకు వరంగా ఉండేది. ప్రస్తుతం మే 19 నుంచి అన్ని ప్రైవేటు ఆస్పత్తుల్లో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈవో ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం సంచలనం కలిగిస్తోంది. పేద వారికి రోగమొస్తే ఇక ప్రాణాలు కోల్పోవడమే అనే వాదనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కావడం ఇబ్బందులకు గురిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా రాకపోవడంతోనే ఇక మీదట ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే జగన్ ప్రభుత్వం మనుగడ కష్టమే. ఆరోగ్య శ్రీ ఉచిత సేవల కోసమే జగన్ ను ఎన్నుకున్నారు. కానీ ఆయన ఇలా మధ్యలోనే వదిలేస్తాడని అనుకోలేదు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని ఇప్పటికే ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్ లో ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.