
Arupadi Veedu : సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందే ఉంటారు యూబ్లడ్ యాప్ ఫౌండర్, జై స్వరాజ్య టీవీ అధినేత డా.జై యలిమంచిలి. ఆయన సేవా కార్యక్రమాలలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూ బ్లడ్ ఆప్ ద్వారా సులభంగా రక్తం పొందవచ్చని, ఆ దిశగా ఎంతో మంది పేదలకు రక్తం అందించి ఆదుకున్నారు. అమెరికాలో సైతం ఆయన సేవా కార్యక్రాలను కొనసాగిస్తూనే ఉన్నారు. యూఎస్ లోని వివిధ సంఘాలు వేడుకలు నిర్వహించిన సమయంలో జై యలమంచిలి వారికి మార్గనిర్దేశంగా నిలుస్తున్నారు.
అమెరికాలోని న్యూ జెర్సీలో సాయి దత్త పీఠం మరియు శ్రీ శివ విష్ణువు టెంపుల్ (SSPSSV) ఆధ్వర్యంలో ఆరుపాడై వీడు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా ఐదు రోజుల దీక్షను మంగళవారం (జూన్ 13) రోజున ప్రారంభించారు. విజయవాడ దుర్గా ఆలయం ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ శంకర శండివియర్ శర్మ చేతుల మీదుగా మొదటి రోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణాన సుబ్రహ్మణ్యం స్వామి విశేషంగా పూజలు అందుకుంటారని తెలిపారు. అయితే, న్యూ జెర్సీ ఎడిషన్ లో ఆరుపడి చేయాలని ఆరేళ్లుగా అనుకుంటున్నా వీలు కాలేదని, జై యలమంచిలి కృషి మేరకు ఇప్పుడు ప్రారంభించామని తెలిపారు.
అయితే ఇప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో విగ్రహాన్ని తామే అందజేస్తామని, పూజాది కాలకు సంబంధించి ఖర్చును కూడా తామే భరిస్తామని జై యలమంచిలి ముందుకు రావడంతో ఈ కార్యక్రమం ఎలాంటి విజ్ఞాలు లేకుండా మొదటి రోజు దిగ్విజయంగా జరిగిందని బ్రహ్మశ్రీ శంకర శర్మ తెలిపారు. జైలో భక్తిభావాలు ఎక్కువగా ఉంటాయని, సేవా కార్యక్రమాలతో పాటు ఆయన భక్తిని చూస్తే ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. విగ్రహాలను చెన్నై నుంచి తెప్పించడంలో, ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించడంలో జై పాత్ర మరువమని చెప్పారు.
ఇక శుక్రవారం (జూన్ 16) రోజున జై యలమంచిలి లావణ్య దంపతుల చేతుల మీదుగా స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఆ రోజు దంపతులను ఆశీర్వదించేందుకు ఇండియా నుంచి మరింత మంది వేద పండితులు వస్తున్నారని చెప్పారు. ఆధ్యాత్మికతలో జై మరింత ముందుకెళ్లాలని బ్రహ్మశ్రీ శంకర శర్మ ఆశీర్వదించారు.






