
Ashu Reddy in Drugs Case :
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న వాటిల్లో డ్రగ్స్ ఒకటి.. ఈ డ్రగ్స్ వలలో చిక్కుకుని ఎంతో మంది కెరీర్ నాశనం అయ్యింది. ఇక ఇటీవలే డ్రగ్స్ ను సరఫరా చేస్తూ కబాలి నిర్మాత పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.. కబాలి తెలుగు నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ ఇటు సినీ వర్గంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది.
అయితే ఈయన కేసులో తాజాగా పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరిని రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఎక్కువ నిజాలు తెలపలేదని చెప్పాడు.. ఈయన విచారణలో కొద్దిమంది పేర్లు మాత్రమే బయట పెట్టినట్టు చెబుతున్నారు.. అయితే ఈయన చెప్పిన లిస్ట్ లో అషు రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలిసింది..
జూన్ 14న కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితాలో ఈయన ఉన్నట్టు తేల్చారు.. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ, టీవీ నటులు, మోడల్స్, వ్యాపారాలు ఇలా చాలా మంది ఇందులో ఉన్నట్టు విచారణలో తేలింది. తెలుగు నటీమణులు ఇద్దరు, సినీ దర్శకులు ఇద్దరు, కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
ఇందులో ఇద్దరు హీరోయిన్ లతో మాత్రం కేపీ చౌదరి 100ల కాల్స్ మాట్లాడినట్టు తెలుస్తుంది.. అషు రెడ్డి పేరు మాత్రం ఇందులో ప్రముఖంగా వినిపిస్తుంది.. ఈ కాల్స్ గురించి ఈయనను పోలీసులు ప్రశ్నించిన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని ఈ కాల్స్ ను డీకోడ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారని అంటున్నారు.. మరి ఈ ఫోన్ సంభాషణ బయటకు వస్తే ఇంకెంత మంది పేర్లు బయటకు తెలుస్తాయో చూడాలి..