Ashureddy Drug Case : డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను ఊపేస్తున్న తరుణంగా ఒక్కొక్కరి పేరు వెలుగులోకి వస్తూనే ఉంది.. గతంలో ఎంతో మంది నటీనటుల పేర్లు డ్రగ్స్ కేసులో భాగంగా పోలీసుల విచారణలో వెలువడ్డాయి. తాజాగా నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో మళ్ళీ ఇన్ని రోజులకు డ్రగ్స్ పేరు వినిపిస్తుంది.. ఈయన అరెస్ట్ తర్వాత ఈయనతో సంబంధాలు ఉన్న వారంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు..
రెండు రోజుల పోలీసుల విచారణ అనంతరం కేపీ చౌదరి కొన్ని విషయాలు మాత్రమే చెప్పినట్టు తెలుస్తుంది. ఈయన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడడంతో ప్రస్తుతం ఆయన కస్టడీ రిపోర్ట్ ను పోలీసులు బయటకు చెప్పడంతో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇందులో ఉన్నట్టు ఈ రోజు వార్తలు వచ్చాయి. మరి అందులో బుల్లితెర నటి అషు రెడ్డి ఉన్నట్టు కూడా టాక్ వినిపించింది.
ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్స్ కంటే ఎక్కువ గ్లామర్ ఒలికిస్తూ క్రేజీ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె లగ్జరీ లైఫ్ గడుపుతున్న నేపథ్యంలో డ్రగ్స్ అమ్మకంలో ఈమెకు కూడా భాగం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి ఈ వార్తలపై తాజాగా అషు రెడ్డి స్పందించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఎవరితో మాట్లాడిన కొన్ని వర్గాల మీడియా తప్పుడు వార్తలను సృష్టిస్తుంది అని దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని నిజానిజాలు ప్రజలకు తెలియజేస్తానని.. ఆ విషయంలో నా పేరు బయటకు వస్తే సహించను అని డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్ఛయింది.