
డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తోంది అనే చెప్పాలి.. గతంలో ఎంతో మంది నటీనటుల పేర్లు డ్రగ్స్ కేసులో భాగంగా బయటకు రాగా ఈసారి కూడా ఒక్కొక్కరిగా పేర్లు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా వారి పేర్లు మార్మోగి పోతున్నాయి.. తాజాగా నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో మళ్ళీ డ్రగ్స్ పేరు వినిపిస్తుంది..
రెండు రోజుల పోలీసుల విచారణతో పాటు కేపీ చౌదరి ఫోన్ డేటా కూడా పోలీసుల చేతిలో ఉంది.. ఈ డేటాలో సంచలన విషయాలు వెలుగులోకి రాగా ముఖ్యంగా అషు రెడ్డి పేరు బాగా వినిపించింది. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్స్ కంటే ఎక్కువ గ్లామర్ ఒలికిస్తూ క్రేజీ స్టార్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఈమె లగ్జరీ లైఫ్ గడుపుతున్న నేపథ్యంలో డ్రగ్స్ అమ్మకంలో ఈమెకు కూడా భాగం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా ఈ డ్రగ్స్ కేసు గురించి ఈమె తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అయిన కూడా ఈమెపై ఆరోపణలు ఆగడం లేదు.. దీంతో తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది..
నా మీద కొన్ని ఛానెల్స్ గాసిప్స్ రాసేస్తున్నాయి.. నా నెంబర్ ను కూడా చెబుతున్నాయి.. దీంతో వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిజాలు తెలుసుకోకుండా మీ న్యూస్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్న.. నేను ఏ తప్పు చేయకపోయినా నిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలా రాస్తారు.. ఆ వార్తలను స్ప్రెడ్ చేస్తున్న ఛానెల్స్ పై పరువు నష్టం కేసు పెట్టబోతున్న అంటూ వార్ణింగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.