దీనికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఇది మెడికో థ్రిల్లర్‌గా సాగుతుందట. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ నెం. 3గా, అరుణశ్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టీ గణపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ, ప్రొడక్షన్ విలువలతో ఎలాంటి రాజీపడకుండా, లావిష్‌గా రూపొందిస్తున్నారు.
అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 1న చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌లో అశ్విన్ బాబు క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. లుక్ పవర్‌ఫుల్‌గా ఉండడంతో సినిమాపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. సగ భాగం దేశంపై మరోవైపు అశ్విన్ ఫేస్ ఉంది. ఇక జనాలు కూడా హైలెట్ అయ్యారు. ఏదో బలమైన సామాజిక అంశాలపైనే సినిమా తీసినట్లు తెలుస్తోంది.
అశ్విన్ కు జోడీగా రియా సుమన్ నటిస్తుండగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీటీవీ గణేష్, సుదర్శన్, యెష్నా చౌదరి, శకలక శంకర్, రాఘవ వంటి వారు లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్‌లో 75 శాతం షూటింగ్ పూర్తయింది. యాడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
గౌర హరి బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అశ్విన్ కెరీర్‌లో ఈ మూవీ ది బెస్ట్ గా నిలుస్తుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైవిధ్య భరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ మూవీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని సమాచారం.
అశ్విన్ నటించిన మరో సినిమా ‘శివం భజే’ ఈ రోజు విడుదలైంది. గంగా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, అశ్విన్ కు జంటగా నటించింది. అప్సర్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.