25.9 C
India
Monday, December 15, 2025
More

    Ashwini Dutt : అశ్వినీ దత్ డ్యామేజ్ కంట్రోల్.. పవన్ పై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన నిర్మాత

    Date:

    Ashwini Dutt - Pawan Kalyan
    Ashwini Dutt – Pawan Kalyan

    Ashwini Dutt  : సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో  సీనియర్ నిర్మాత అశ్వినీదత్ చాలా సింపుల్ గా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. అయితే చాలా సార్లు ఆయన చేసిన కామెంట్లు వివాదం అవుతుంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ మధ్య ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే సినీ నిర్మాతలు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు.

    తిరుపతి, వైజాగ్, అమరావతి లాంటి ప్రాంతాల్లో సినీ షూటింగ్ లు తీసుకోవడానికి అవకాశాలు పెంచాలని అడిగారు. అలాగే టికెట్ రేట్స్ ను పెంచేలా కృషి చేయాలన్నారు.  అయితే అశ్వినీ దత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీెం పవన్ కల్యాణ్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలు చెప్పినపుడు ఆయన కొన్ని సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు.

    ఢిల్లీ, ముంబయి లలో రూ. 1000, 1500 అని టికెట్ ఫ్లెక్సీ ప్రైసింగ్ పెడితే ఎలా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారని అయితే దాన్ని తాము సున్నితంగా తిరస్కరించామని చెప్పారు. అలాంటివి తెలుగు ఇండస్ట్రీలో సరిపడవని అన్నారు. అయితే ఈ విషయాన్ని అశ్వినిదత్ బయటకు మాట్లాడగా.. నెటిజన్లు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. సినిమా చూసేది చాలా మంది సామాన్యులే అన్న విషయం మరిచిపోయారా అని కామెంట్ చేశారు. అసలు ఆ రేట్లేంటి.. సినిమాలకు రావాలా వద్దా అని తెగ విమర్శలు చేశారు.

    అయితే ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో పవన్ కు ఇబ్బంది తెచ్చి పెట్టేలా ఉందని అశ్విని దత్ తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల విషయంలో పెంపుదల గురించి కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా దాన్ని వివాదం చేస్తున్నారు. అయితే ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ఒక శాశ్వత ప్రతిపాదన ఉండాలని డిప్యూటీ సీఎం అన్నారు.

    సినిమా రేట్లను ఏ మేరకు పెంచుకోవచ్చని నిర్మాతలు డిప్యూటీ సీఎంతో చర్చించామని ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని.. టికెట్ల రేట్లు వారం రోజులు పెంచడమా? లేక పదిరోజులా ఇలా రిలీజ్ అయిన సినిమాను బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలన్న అనేక చర్చలు జరిగాయని తెలిపారు. పవన్ కల్యాణ్ నిర్మాతలకు అండగా ఉంటామని చెప్పారని అశ్వినిదత్ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన...

    CM Chandrababu : నేడు హైదారాబాద్ కు ఏపీ సీఎం

    ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాలకు హాజరు CM Chandrababu :...