
Dr. Pratap C. Reddy : 92 ఏళ్ల వయసులోనూ అపార శక్తితో పనిచేస్తూ, రూ.70,000 కోట్ల ఆరోగ్య సామ్రాజ్యాన్ని నిర్మించిన డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భారత వైద్యరంగంలో ఒక శకటాంతర పురుషుడు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన, అక్కడి అవకాశాలను వదిలి మాతృభూమికి సేవ చేయాలన్న తండ్రి ఆశయాన్ని గౌరవించి భారత్‌కి వచ్చారు. 1979లో ఒక రోగి చనిపోవడం చూసిన తరువాత, భారతదేశంలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అపోలో హాస్పిటల్స్‌ను స్థాపించారు.
ఈ రోజు అపోలో గ్రూప్ 71 హాస్పిటల్స్, 5,000 ఫార్మసీలు, 291 ఆరోగ్య కేంద్రాలతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ప్రయాణం డాక్టర్ రెడ్డి ఆశయం, నిబద్ధత, కృషికి ప్రతిరూపం. సంపద కాదు, సేవే తనకు తృప్తినిచ్చే ధనం అని ఆయన చెప్పే మాటలు, ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయి.