
Ratan Tata : పేదల మనిషి రతన్ టాటా.. ఆయన ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉన్నా.. పేదవాడిలాగే కాలం గడిపారు. కోట్లు ఉన్నాయి కదా అని విలాసాలకు వెళ్లకుండా సాధారణ జీవితం గడిపారు. పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రతన్ టాటా తన జీవితాన్ని మొత్తం టాటా ట్రస్ట్, టాటా కంపెనీలకే పరిమితం చేశాడు. ఆయన ఎంతటి గొప్పవ్యక్తో బిగ్ బీ కొన్ని ఆసక్తి కర విషయాలను కౌన్ బనేగా కరోడ్ పతిలో చెప్పారు. ఒక సారి లండన్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానంలో రతన్ టాటా కలిశారు. ఇద్దరం హీత్రూ ఎయిర్ పోర్ట్ లో దిగాం. రతన్ టాటాను తీసుకెళ్లేందుకు కంపెనీ ఎంప్లాయీస్ ఎవరూ కనిపించలేదు. దీంతో వారికి ఫోన్ చేద్దామని ఫోన్ బూత్ లోకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఆయన వద్ద డబ్బుల లేవు. నా వద్దకు వచ్చి కొంచెం ఫోన్ చేసుకునేందుకు డబ్బు ఇస్తావా? అని అడిగారు. బిలియన్ల కొద్దీ డబ్బును దానం చేసే కంపెనీ చైర్మన్ వద్ద జేబులో డబ్బు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఆ సమయంలో ఆయన సాధారణ వ్యక్తిగా కనిపించారు. నా కళ్లల్లో నీరు తిరిగింది. వెంటనే డబ్బు ఇచ్చాను. గొప్ప వ్యక్తి రతన్ టాటా..